ఇండియా కూటమి బలపరచిన అరకు ఎంపి, పాడేరు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించుకుందామని బుధవారం మధ్యాహ్నం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లిలో రోడ్ షో నిర్వహించారు. గిరిజన ప్రజలు స్వతహాగా వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందకరత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. లోకనాధం, సిహెచ్ నర్సింగరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు ప్రసంగిస్తూ గిరిజన హక్కులు చట్టాలు కాపాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని గుర్తు చేశారు.