తుంబ్రిగూడ మండలంలోని తూటంగి పంచాయతీ నేరేడువలస కల్వర్టును వెంటనే నిర్మించాలని.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే సురేంద్ర డిమాండ్ చేశారు. గురువారం ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు రాకపోకలకు తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన తాత్కాలిక కాజ్ వే ను ఆయనతోపాటు సిపిఎం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్వర్టు నిర్మించకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.