అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలంలోని గుర్రాయి జలపాతం గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది. కానీ ప్రస్తుతం, యువత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. తుప్పలు తొలగించి, రోడ్డు పనులు ప్రారంభించారు, పర్యాటకులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు. ఈ సమస్యను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ కిల్లు రమేష్ నాయుడు దృష్టికి తీసుకురావడం కోసం యువత యత్నిస్తున్నారు.