పాడేరు శ్రీ మోదమాంబ హై స్కూల్ విద్యార్థులు ముఖ్యమంత్రి సహాయ నిధికి రు. 1 లక్ష 5 రూపాయల విరాళాన్ని అందజేశారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ను కలిసి విద్యార్థులు సేకరించిన లక్ష రూపాయల నగదును జిల్లా కలెక్టర్ ఏ. ఎస్ దినేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.