రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నారా చంద్రబాబు నాయుడును శనివారం అమరావతి పార్టీ కార్యాలయంలో పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పాడేరు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితుల అలాగే గిరిజన ప్రాంతంలో అన్నా క్యాంటీన్ అవసరం గురించి వివరించారు. గిరిజన అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గం సమస్యలు గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.