ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు అని పాడేరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి ఆదివారం తెలిపారు. తెల్లకార్డు రేషన్ కార్టు ఉన్న 1. 47 కోట్ల కుటుంబాలు సంవత్సరానికి 3 సిలిండర్లను ఇవ్వడానికి సుమారు 3, 640 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.