జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా.. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులిపురుగుల నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 6 నెలలకు ఒక మోతాదు మాత్రలను విద్యార్థులు అందించడం వలన రక్తహీనతను నిర్ములించవచ్చన్నారు. అనంతరం శుక్రవారం పాడేరు కలెక్టరేట్ భవనంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.