అనంతగిరి మండల కేంద్రంలో శనివారం ఉపాధి హామీ కార్యాలయం వద్ద ఎంపిడిఓ ఏవివి కుమార్ ఆధ్వర్యంలో.. టెక్నికల్ అసిస్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్ లకు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. జాబ్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి 100 రోజు పనులను పూర్తి చేయించాలన్నారు. గోకులాలు, ఇంకుడు గుంతలు, చెరువులు, పీఎంవై హౌసింగ్, ఉద్యానవన పంటలుకు సంబంధించిన పనులను సకాలంలో పూర్తిచేయాలని సిబ్బందికి ఆదేశించారు.