విశాఖ: అధిక ధరలు అరికట్టాలి: సిపిఎం
విశాఖలోని 59వ వార్డులో బుధవారం సిపిఎం ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ నాయకులు లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. అధిక ధరలు అరికట్టాలని, ట్రూఆఫ్ ఇంధన సర్దుబాటు పేరుతో కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై బారాలు వెయ్యద్దు అన్నారు. ప్రచారం ముగింపు సందర్భంగా ములగాడ తహాసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ జోన్ నాయకులు తెలిపారు.