ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీసం వేతనం 26, 000 ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంతంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఏడాదికి ఒకసారి ఒక నెల జీతాన్ని బోనస్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈపీఎఫ్ , పీఎఫ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈనెల 30వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.