సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలని జీవీఎంసీ అధికారులు సూచించారు. శనివారం కంచరపాలెం పరిధిలో కప్పరాడ జీవీఎంసీ హైస్కూల్లో విద్యార్థులకు పలు అంశాలపై జీవీఎంసీ అధికారులు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రజలకు పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు.