ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ జనసేన నేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆయన విశాఖలోమీడియాతో మాట్లాడారు. ఏ మతంలో తప్పు జరిగినా ఆ మతానికి చెందిన వారందరూ ప్రతిఘటించాలని కౌంటర్ ఇచ్చారు. తిరుమల విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతినేలా ఎవరూ ప్రవర్తించొద్దని ఆయన హితవు పలికారు.