పాడేరు పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ సిహెచ్ నరసింహులు శనివారం మాడుగుల మండలం సాగరం గ్రామంలో జరుగుతున్న ఉచిత నట్టల నివారణ టీకాల కార్యక్రమం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈనెల 31 వరకు మండలంలోని అన్ని గ్రామాలలోని నిర్వహిస్తామన్నారు. గొర్రెలు, మేకలకు ఉచితముగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయబడునని చెప్పారు. కాబట్టి గొర్రెలుమేకల పెంపకందార్లు సద్వినియోగ పరుచుకావాలన్నారు.