ప్రతి రైతు ఆర్థిక అభివృద్ధి సాధించి దిశగా ముందుకు సాగాలని భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి జలగం కుమార్ స్వామి చెప్పారు. బుధవారం మాడుగుల తెన్నేటి రైతు ఉత్పత్తి దారుల సర్వ సభ్య సమావేశాన్ని స్ధానిక సేవా భారతి కార్యాలయం వద్ద నిర్వహించారు. సంఘo చైర్మన్ పిల్లా అప్పల నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగాఎంపిడిఓ కొంకి అప్పారావు. బీజేపీ రాష్ట్ర నాయకులు పుట్టా గంగయ్య హాజరయ్యారు.