మాడుగుల తుడుంవీధిలో ఆదివారం సాయంత్రం గ్యాస్ లీకై కమ్మల పూరి గుడిసె దగ్దమైంది. తూరుబిల్లి సంతోష్ పావనికి చెందిన ఈ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకు అవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. దీంతో ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఇంట్లో గల వివిధ వస్తువులు కాలిబూడిదయ్యాయి, , అగ్ని మాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.