పంట సాగులో రసాయనిక ఎరువులు ఆధికంగా వాడడం వల్ల ఆహార ఉత్పత్తులు విషతుల్యం ఆవుతున్నాయని వినూత్న అగ్రో టెక్ ఎల్. ఎల్. పి డెవలప్మెంట్ అధికారి గూడపు రామకృష్ణ అన్నారు. ఆదివారం కే కోటపాడు మండలం చింతపాలెం గ్రామంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రసాయన ఎరువులు వాడకం వల్ల క్రమక్రమంగా భూమిలో భూసారం తగ్గిపోయి, పంట దిగుబడులు పడిపోతాయన్నారు. ఫలితంగా మానవ జంతువాళికి ముప్పును కల్పిస్తాయన్నారు.