కొయ్యూరు: నవంబర్ 2 వరకు భూ సర్వే పై గ్రామ సభలు
కొయ్యూరు మండల వ్యాప్తంగా వచ్చే నెల రెండు వరకు సమగ్ర భూ సర్వేలపై గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు. గురువారం నూతన తహసిల్దార్ ( ఎఫ్ఏసి )గా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామి తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15 నుండి నవంబర్ 2 వరకు భూ సర్వే పై గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు.