గంజాయి రవాణా నిర్మూలనకు సహకరించాలి : అరకు సిఐ హిమగిరి
పర్యాటక కేంద్రమైన అరకులోయ మన్యంలో గంజాయి రవాణా నిర్మూలనకు సహకరించాలని ఒడిశా పాడువ ఎస్. హెచ్. ఓని అరకు సిఐ హిమగిరి కోరారు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు శనివారం సిఐ హిమగిరి పాడువలో ఉన్న పోలీస్ స్టేషన్లో సందర్శించి ఎస్. హెచ్. ఓతో కలసి చర్చించారు. ఒడిశా సరిహద్దు గ్రామాల రహదారి నుండి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు. నిర్మూలనకు సహకరించాలని ఎస్. హెచ్. ఓని కోరారు. ఇందులో ఎస్ఐ సంతోష్ ఉన్నారు.