విద్యార్థి మృతి చెందిన సంఘటనలో వైస్.ప్రిన్సిపాల్ సస్పెన్షన్
అరకులోయ మండలంలోని గురుకుల బాలుర పాఠశాలలో (పీవీటీజీ) పనిచేస్తున్న వైస్. ప్రిన్సిపాల్ పిజిటి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న వై. నరసింహంను పాడేరు ఐటిడిఏ పిఓ వి. అభిషేక్ సస్పెండ్ చేశారు. గురుకుల బాలుర పాఠశాలలో 10వతరగతి విద్యార్థి బడ్నాయిని. ప్రవీణ్ కుమార్ కొట్టడంతో శుక్రవారం కేజీహెచ్‌లో మృతిచెందిన సంఘటనలో వైస్. ప్రిన్సిపాల్ నరసింహంను పాడేరు ఐటిడిఏ పిఓ అభిషేక్ సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.