అరకులోయ మండలం పెదలబుడు పంచాయితీ పరిదిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను 15 మంది ఏహెచ్ఏలు టీంగా బుధవారం నుండి వేస్తున్నారని వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ జె సాంబశివరావు తెలిపారు. పెదలబుడు పంచాయితీ పరిదిలో 3200 పశువులు ఉంటే వీటిలో 2078 పశువులకు టీకాలు వేశారని తెలిపారు. గురువారం టీకాలతో పాటూ పెదలబుడు గ్రామంలో 10 పశువులకు పశుభీమా కూడా చేశామని పశుసంవర్ధక సహాయకులు ధర్మ పేర్కొన్నారు.