అరకులోయ మండలం, పద్మాపురం పంచాయితీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరకులోయ ఎంపిడిఓ వెంకటేష్, తాహశీల్దార్ వేణుగోపాల్, ఈఓపీఆర్డీ వెంకటేశ్వరరావు, పంచాయితీ ఈఓ రాంబాబు, పంచాయితీ పెద్దలు మహదేవ్, యాసిన్ లు పద్మాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నిర్ధేశించిన పాంప్లేట్స్, స్టిక్కర్స్ అంటించారు. ఈ 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన పింఛను పెంపు, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ, అన్నా క్యాంటిన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, వరద భాదితుల సహాయం వంటి పనులను ప్రజలకు ఎంపీడీఓ వెంకటేష్ వివరించారు.