అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. గ్రాంథికంలో ఉన్న తెలుగుని వ్యవహారిక భాషలోకి అనువదించిన గిడుగు రామూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతారని ప్రిన్సిపాల్ డా రామకృష్ణ తెలిపారు. ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరిపి ధ్యాన్ చంద్ తో పాటూ మిగిలిన క్రీడాకారులను స్మరించుకుంటామని వైస్ ప్రిన్సిపాల్ చలపతి రావు పేర్కొన్నారు.