తల్లిపాలకు దూరమైన కవల పిల్లలకు రెండేళ్ల పాటు ఉచితంగా పాల డబ్బాలు పంపిణీ చేయడానికి.. యూనిట్ ఫర్ ఛారిటీ ట్రస్ట్ ముందుకు వచ్చింది. డుంబ్రిగూడ మండలం గోంగూడ గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన వంతాల సొయిత నెల క్రితం కవలలకు జన్మనిచ్చి మరణించింది. ఈ నేపథ్యంలో చంటి పిల్లలైన కవలలకు రెండేళ్ల పాటూ ఉచితంగా పాల డబ్బాలు ఇవ్వడానికి యూనిట్ ఫర్ ఛారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. మంగళవారం పాల డబ్బాలను ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర చేతుల మీదుగా కవల పిల్లల కుటుంబానికి అందించారు.