అరకులోయ మండల పరిధిలోని మొత్తం 6537 సామాజిక ఫించన్లకు రూ.2,79,70,500 మంజూరైనట్లు ఎంపీడీఓ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. ఒక్కొ సచివాలయ ఉద్యోగి 50 ఫించన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 31 తేదీన సామాజిక పింఛన్లను పంపిణీ జరగుతాయని పేర్కొన్నారు. 31వ తేదిన పింఛను తీసుకోని లబ్ధిదారులు సెప్టెంబరు 2వ తేదీన తీసుకోవచ్చని అన్నారు. ఫించను పంపిణీ ఉదయం 6 గంటల నుండి ప్రారంభించాలని సూచించారు.