రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్ ని నామినేట్ పదవుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం నియమించడంతో అల్లూరి జిల్లా మన్యంలో శనివారం సంబరాలు నిర్వహించారు. అనంతగిరి మండలంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో జిల్లా కార్యవర్గ నాయకులు జోగులు దయానిధి, మండల పార్టీ నాయకులు రంజిత్ తదితరులున్నారు.