అనంతగిరి మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రమైన బొర్రా గుహలో గత వారం రోజుల నుండి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ అందుబాటులో లేదని స్థానిక సర్పంచ్ జన్ని అప్పారావు సోమవారం అన్నారు. పర్యటకులకు, గిరిజనులకు సిగ్నల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సంబంధిత బిఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి త్వరితగతిగా సిగ్నల్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.