అనంతగిరి మండలం కొండిబా గ్రామ సచివాలయ కేంద్రంలో గ్రామ పంచాయితీ సెక్రటరీ కొర్ర దామోదార్, అంగన్వాడి సూపర్వైజర్ సత్యవతి, అంగన్వాడి సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.