అరకులోయ మండలం మారుమూల ఇరగాయి పంచాయితీలోని ఇరగాయి, బోందుగూడ గ్రామాలకు అరకు సిఐ హిమగిరి, ఎస్ఐ సంతోష్ గురువారం సాయంత్రం సందర్శించారు. గంజాయి, సారా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి పండించడం, రవాణా చేయడం నేరమని గ్రామస్తులకు సిఐ అవగాహణ కల్పించారు. గంజాయి రవాణాలో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. అన్లైన్ మోసాలకు పాల్పడకూడదని సూచించారు.