మంగళవారం నుంచి అరకులోయ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్‌లో పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలున్స్ అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు గట్ల సంతోష్ తెలిపారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు, మరల సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా పొగమంచు మధ్యలో అరకు అందాలను సుమారు 300 అడుగుల మేర పర్యాటకులను పైకి తీసుకువెళ్లి మళ్లీ కిందకి దింపుతుందని నిర్వాహకులు తెలిపారు.