లోక్ అదాలత్‌లతో సమస్యల పరిష్కారం
రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని.. అనకాపల్లి జిల్లా జడ్జ్ శ్రీవిద్య పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే పని ఉండదని సూచించారు. నేషనల్ లోక్ అదాలత్ లో భాగంగా అనకాపల్లి కోర్టులో శనివారం అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. కక్షిదారులకు పలు సూచనలు చేశారు. అనవసరమైన గొడవలు పెంచుకొని బంధుత్వాలు పోగొట్టుకోవద్దన్నారు.