సాంబారులో కప్ప వచ్చిందని ఏపీలోని గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్థినులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం భోజనంలో పురుగులు, సాంబారులో కప్ప వచ్చిందని విద్యార్థులు భోజనం మానేసి ఆందోళనకు దిగారు. విషయం బయటకు రాకుండా వర్సిటీ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ శుక్రవారం రాత్రి మరోసారి వసతిగృహం వద్ద విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.