జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మెన్ వార్ల విజయ్ కుమార్ ను సోమవారం నారాయణపేట మున్సిపల్ కమిషనర్ సునీత శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మెన్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను సన్మానించారు. పట్టణంలోని గ్రంథాలయాల అభివృద్ధికి సహకరిస్తామని కమిషనర్ చెప్పారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.