కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని, ప్రత్యేక స్కాలర్షిప్ లు, సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేయాలని , హాస్టల్లో నెలకొన్న సమస్యలపై బుధవారం అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ గేటు ముందు విద్యార్థులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డి అర్ ఓకి వినతిపత్రాన్ని అందజేశారు.