రాజోలు: రోగి మృతి.. బంధువుల ఆందోళన

రాజోలు పట్టణ కేంద్రం రాజోలులోని ఓ ప్రైవేటు హాస్పిటల్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మలికిపురం మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన కందికట్ల మంగ మృతి చెందింది. కణితి ఆపరేషన్ నిమిత్తం మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపట్లోనే మంగ మృతి చెందిందటంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించిందని కుటుంబీకులు ఆరోపించారు. న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద గ్రామస్థులు, కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

தொடர்புடைய செய்தி