రాజోలు: ఈ నెల 9 వరకూ మద్యం షాపులకు అప్లికేషన్ లు

నూతన మద్యం విధానంతో కోనసీమకు అప్లికేషన్ ల ద్వారా ఇప్పటివరకూ సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చిందని జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ ప్రసాద్ తెలిపారు. సోమవారం రాజోలు మండలం రాజోలులో ఆయన మాట్లాడుతూ. జిల్లాలో 133 షాపులకు 3500 అప్లికేషన్లు రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. 9వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించి, 11న అమలాపురంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி