సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామములో వేంచేసియున్న శ్రీ లక్ష్మి నరసింహస్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివధత్ మంగళవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. వీరికి ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.