రాజోలులో వాడివేడిగా సర్వసభ్య సమావేశం

రాజోలు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎంపీపీ కేతా శ్రీనివాస్ అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. ఈ సమావేశంలో కడలి గ్రామ సర్పంచ్ చొప్పల గుణనాధ్ విద్యుత్ సమస్యల పై విద్యుత్ శాఖ అధికారులను నిలదీశారు. అలాగే తాటిపాక సర్పంచ్ రత్నమాల ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరు బాగోలేదు అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ నుంచి గ్రామంలో తాగునీరు సరఫరా కావడం లేదని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు.

தொடர்புடைய செய்தி