పేద విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చడమే లక్ష్యం: మంత్రి

వేద విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చడమే తన లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం రామచంద్రపురంలోని వీఎస్ఏం కళాశాల వద్ద 45 రోజులుగా మంత్రి దాతల సహకారంతో ఉచితంగా నిర్వహిస్తున్న టెట్, డీఎస్సీ కోచింగ్ పూర్తైన సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி