గ్యాస్ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాలని పాడేరు డీఎస్పీ కే. ప్రమోద్ సూచించారు. గ్యాస్ ప్రమాదాల నియంత్రణపై శుక్రవారం పాడేరులో అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ దీననంధు, ఎస్ఐ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.