వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

అరకులోయ మండలంలోని శరభగుడ గ్రామంలో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ కొర్ర. ప్రసన్నకుమార్ డిమాండ్ చేస్తున్నారు. శనివారం అరకులోయ నుంచి ఆయన మాట్లాడుతూ. శరభగుడ గ్రామంలోని వీధి కుక్కల దాడిలో పాఠశాల చిన్నారులు ప్రజలు గాయాలు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల దాడిలో ప్రాణాలు పోకముందే సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி